టీఎస్‌పీఎస్సీ రెండు కొత్త నోటిఫికేషన్లు: 276 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా, మరో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 37
ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 91
మొత్తం : 128
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు మల్టీజోన్ -1 : 100
మల్టీజోన్ -2 : 48
మొత్తం : 148.
మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.












Click it and Unblock the Notifications