టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్: డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 18 డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను డిసెంబర్ 16 నుంచి స్వీకరించనున్నారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 15, 2023గా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రొఫార్మా అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

TSPSC releases notification for 18 vacancies of drugs inspector in drugs control administration dept

ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రెండ్రోజుల క్రితమే 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య శఆఖలో 1147 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చేయనున్నారు.

మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబర్ 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5వ తేదీన సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+