TSRJC: విద్యార్థులకు అలర్ట్, అప్లికేషన్ షురూ, పరీక్ష ఎప్పుడంటే?
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష (TSRJC CET) 2024కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 (15 బాలురు, 20 బాలికల కాలేజీలు) గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి ఏప్రిల్ 21న పరీక్షనిర్వహించనున్నారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు జనవరి 31 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ. 200. ఈ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఈ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. టీఎస్ఆర్జేసీ సెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీట్ల కేటాయింపునకు తొలి కౌన్సెలింగ్ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications