UCILలో అప్రెంటిస్ పోస్టులు: ఐటీఐ డిప్లొమా పూర్తి చేశారా.. అయితే అప్లయ్ చేయండి..!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 242 అప్రెంటిస్ పొజిషన్లను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ద్వారా పేర్కొంది.

ఇక ఖాళీల వివరాల విషయానికొస్తే ఫిట్టర్‌లో 80 పోస్టులు, ఎలక్ట్రీషిషయన్ పోస్టులు 80, వెల్డర్ గ్యాస్ మరియు ఎలక్ట్రిక్ పోస్టులు 40, టర్నర్ మెకానిస్టు 15 పోస్టులు,ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్ 5 పోస్టులు, డీజిల్/మెకానిక్ ఎంవీ 12 పోస్టులు, కార్పెంటర్ 5 పోస్టులు, ప్లంబర్ 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రీషిషయన్,వెల్డర్ గ్యాస్ మరియు ఎలక్ట్రిక్,టర్నర్/మెకానిస్ట్ / ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ ఎంవీ /కార్పెంటర్/ప్లంబర్ ట్రేడ్‌లలో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయస్సు 25 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి. ఐటీఐ లేదా డిప్లొమాలో సంబంధిత ట్రేడ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

UCIL Recruitment 2021:Apply for 242 Apprentice posts

సంస్థ పేరు: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌

పోస్టు పేరు: అప్రెంటిస్

పోస్టుల సంఖ్య:242

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఆయా ట్రేడ్‌లో ఐటీఐ/డిప్లొమా

వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయస్సు 25

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 9 అక్టోబర్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 అక్టోబర్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.ucil.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+