Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెలకు రూ.93,960 జీతంతో "యూకో బ్యాంక్‌" ఉద్యోగాలు..

ప్రముఖ పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యూకో బ్యాంక్‌ (UCO Bank) నిరుద్యోగులకు తీపికబురు ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన ఈ ప్రకటనలో మొత్తం 173 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 (JMGS-1)తో పాటు మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 (MMGS-2) కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి వేతనం కోరుకునే అభ్యర్థులకు యుకో బ్యాంక్ ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన కోసం యుకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

uco-bank-notification-for-173-jobs-with-huge-salary

పోస్టుల వివరాలు..

JMGS-1 కేటగిరీలో వివిధ సాంకేతిక, ఫైనాన్స్ సంబంధిత పోస్టులు ఉన్నాయి. ఇందులో

  • ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ - 30
  • చార్టర్డ్ అకౌంటెంట్ - 50
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 5
  • డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ - 3
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - 3
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్ - 15
  • మ్యూరెక్స్ డెవలపర్ - 5
  • ఫినాకిల్ డెవలపర్ - 5
  • క్లౌడ్ ఇంజనీర్ - 3
  • ఏఐ/ఎంఎల్ ఇంజనీర్ - 2
  • డేటా అనలిస్ట్ - 2
  • డేటా సైంటిస్ట్ - 2
  • సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ - 3 పోస్టులు ఉన్నాయి.

అదేవిధంగా MMGS-2 కేటగిరీ కింద

  • ట్రెజరీ ఆఫీసర్ - 10
  • చార్టర్డ్ అకౌంటెంట్ - 25
  • డేటా అనలిస్ట్ - 3
  • డేటా సైంటిస్ట్ - 3
  • డేటా ఇంజనీర్ - 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంబీఏ/సీఏ లేదా సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి..

2026 అక్టోబర్ 1 నాటికి JMGS-1 పోస్టులకు 20 నుంచి 30 ఏళ్లలోపు

MMGS-2 పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీలకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం & ఫీజు..

అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175గా నిర్ణయించారు.

ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష, అవసరాన్ని బట్టి స్క్రీనింగ్ లేదా గ్రూప్ డిస్కషన్, అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ప్రతి దశలో ప్రతిభ చూపిన వారిని మాత్రమే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తారు.

JMGS-1 పోస్టులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు

MMGS-2 పోస్టులకు నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతం చెల్లిస్తారు.

అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం అలవెన్సులు, ఇతర సదుపాయాలు ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+