యూజీసి నెట్ డిసెంబర్ 2023 పరీక్షల తేదీలు వచ్చేసాయి...
యూజీసి నెట్ డిసెంబర్ 2023 పరీక్షల తేదీలు వచ్చేసాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక ఈ పరీక్షల రిజల్ట్‌ను 2024, జనవరి 10న వెల్లడించనున్నారు.
పరీక్షకు వారం రోజుల ముందే అడ్మిట్ కార్డ్ : యూజీసి నెట్ పరీక్ష మొత్తం 83 సబ్జెక్టుల్లో ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు పది రోజుల ముందుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి షిఫ్టులో పరీక్షలు జరగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థులో ఆరుశాతం మందిని నెట్ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఇక, జెఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో కనీస అర్హత మార్కులతో ఉత్తీర్ణులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పరీక్షను ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో పరీక్ష కేంద్రాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ వంటి కేంద్రాల్లో యూజీసి నెట్ పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు.. అమరావతి, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం,అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కేంద్రాల్లో యూజీసి నెట్ పరీక్షను రాయొచ్చు. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 ఈ ఫోన్ నెంబరును సంప్రదించి వారి సందేహాలను నివృత్తి చేసుకోగలరు.












Click it and Unblock the Notifications