యూజీసీ నెట్ పరీక్ష తేది మార్పు.. జూన్ 18న పరీక్ష..
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీ వాయిదా వేసారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16 వ తేదీన నెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ, అదే రోజూ యూపీఎస్సీ ప్రిల్సిమ్స్ పరీక్ష ఉన్నందున నెట్ పరీక్షను వాయిదా వేశారు. జూన్ 18వ తేదీన నెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్‌షిప్, అసిస్టెంట్ఫ్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందే అవకాశం లభిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ-NET పరీక్ష 83 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను పెన్, పేపర్ విధానంలో జరుగుతుంది. పరీక్షకు 10 రోజుల ముందు నుంచే అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in, www.nta.ac.in)లలో సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల అవుతాయి. అభ్యర్థులు ఇతర పూర్తి సమచారం కోసం లేదా లేటెస్ట్ అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
ఎన్‌టిఎ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ప్రకారం జూన్ 16న 'నెట్' పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ, అదే రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండడంతో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ నెట్‌ను జూన్ 16వ తేదీనుంచి జూన్ 18వ తేదీకి మార్చాలని నిర్ణయించినట్టు అధికారి తెలిపారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55శాతం మార్కులను కలిగి ఉండాలి. యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్శిటీలు/సంస్థల నుంచి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉన్నవారు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.

మే 12 వరకు దరఖాస్తుకు అవకాశం...
యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైంది. మే 12న రాత్రి 11.50 గంటల వరకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష కేవలం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లోనే జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లలో ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఇస్తారు. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులు, 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు.












Click it and Unblock the Notifications