యూజీసీ నెట్ రిజల్ట్స్ రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET June 2025) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 285 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10,19,751 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 7,52,007 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈసారి పరీక్ష ఫలితాల్లో మొత్తం 1.88 లక్షల మంది పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. జేఆర్‌ఎఫ్ (Junior Research Fellowship), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పొందిన వారు మొత్తం 5,269 మంది ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్లకు అర్హత పొందినవారు 54,885 మంది ఉండగా.. కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్లకు మాత్రమే అర్హత సాధించినవారు 1,28,179 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.

85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష..
ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహించే UGC-NET పరీక్షను ఈసారి జూన్‌లో 85 సబ్జెక్టులకుగాను కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులకు అర్హతను నిర్ధారించేందుకు అవకాశం కల్పించబడింది.
స్కోర్‌కార్డ్ & ఆన్సర్ కీ ఎలా చూడాలి..?
అభ్యర్థులు తమ ఆఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆన్సర్ కీ లింక్:
https://ugcnet.nta.ac.in/AnswerKey_june2025.html
స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్:
https://ugcnet.ntaonline.in/certificate/index
ఇతర ముఖ్యమైన విషయాలు..
- జూన్ 2025 పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ ఇటీవలే విడుదల కాగా, అభ్యర్థుల అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు.
- ఫలితాలు, ఆన్సర్ కీ లింకులు పూర్తిగా NTA అధికారిక పోర్టల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
- స్కోర్ కార్డుతో పాటు అర్హత సర్టిఫికెట్ త్వరలోనే డిజిటల్ ఫార్మాట్‌లో అందించనున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications