Visa News: విద్యార్థులు, ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఆ దేశంలో ఎంట్రీ ఇక మరింత సులభం

UK News: విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం వారి అవసరాలకు తగిన విధంగా ఓ దేశాన్ని సెలక్ట్ చేసుకుంటారు. ఆయా దేశాలు కూడా వివిధ దేశాల యువతను ఆకర్షించేందుకు పలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో తమ కలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది.

నైపుణ్యం కలిగిన సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు విదేశాలకు వెళ్లి అన్వేషించడానికి, సంపాదించడానికి మరియు నేర్చుకోవడానికి పుష్కలమైన అవకాశాల కోసం చూస్తారు. అయితే అనేక దేశాల్లోని ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఇలా వెళ్లడాన్ని కష్టతరం చేస్తాయి. UK ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా భారతీయులకు వరమని చెప్పవచ్చు. విద్యార్థులు మరియు నిపుణులు అక్కడ నివసించడానికి మరియు పని చేసుకోవడానికి సహకారం అందిస్తుంది.

UK offering India Young Professionals Scheme Visa to aspirant Indians

ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసాను 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పౌరులు పొందవచ్చు. దీని ద్వారా 2 సంవత్సరాల వరకు UKలో నివసించడానికి మరియు పని చేయడానికి అనుమతి ఉంటుంది. వీసా కోసం ముందుకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ బ్యాలెట్‌లో నమోదు కావాల్సి ఉంటుంది.

ఇందుకోసం దరఖాస్తుదారులు తమ పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలతో పాటు పాస్‌పోర్ట్ ఫోటో, ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామాను అందించాలి. UK ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా విజయవంతమైన ఎంట్రీలు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయబడతాయి. బ్యాలెట్ ముగిసిన 2 వారాలలోపు ఫలితాలు ఇమెయిల్ ద్వారా అందజేయబడతాయి. బ్యాలెట్ ఫలితాలు ఫైనల్ గా తీసుకుంటారు. ఇందులో విఫలమైతే అప్పీల్ చేయడం కుదరదు.

బ్యాలెట్‌లో విజయం సాధించిన అభ్యర్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు. అనంతరం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్‌తో సహా వీసా దరఖాస్తు రుసుమును చెల్లించడానికి మరియు వారి బయోమెట్రిక్‌లను అందించడానికి 90 రోజుల సమయం ఉంటుంది. అవసరమైన పత్రాలను అందించిన 3 వారాల్లోగా వీసాపై తుది నిర్ణయం తెలియచేయబడుతుంది.

ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా కోసం దరఖాస్తుకు కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు UKకి వెళ్లాలనుకుంటున్న తేదీ నాటికి కనీసం 18 ఏళ్లు నిండిన ఇండియన్ అయి ఉండాలి. తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత అవసరం. అక్కడ నివసించేందుకు అనువుగా 2,530 పౌండ్ల పొదుపు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుముగా 298 పౌండ్లు, హెల్త్‌కేర్ సర్‌చార్జ్ కింద 1,552 మరియు వ్యక్తిగత పొదుపు కోసం 2,530 అవసరం అవుతాయి. వీసా కోసం ఎంపికైన తర్వాత దరఖాస్తుదారులు 24 నెలల వరకు UKలో నివసించవచ్చు మరియు పని చేసుకోచ్చు. వీసా చెల్లుబాటులో ఉన్న ఈ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆ దేశంలోకి ప్రవేశించవచ్చు మరియు వెళ్లి తిరిగి రావచ్చు. స్వయం ఉపాధి పొందగలగడమే కాకుండా కంపెనీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+