Union Bank Of India నుంచి భారీ ఉద్యోగ ప్రకటన: స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు: అర్హతలు ఇవే..!!
డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగిగా మిగిలిపోయారా.. బ్యాంకులో ఉద్యోగం చేయాలనే ఆశ ఉందా.. అయితే ఇలాంటి వారికోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 347 పోస్టులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ఇక పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ జాతీయ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలు చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా 347 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్టు ఆఫీసర్ కేడర్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక ఈ పోస్టులన్నీ పర్మినెంట్ పోస్టులని పేర్కొంది.
స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల్లో భాగంగా పోస్టులను విభజించి చూస్తే సీనియర్ మేనేజర్ (రిస్క్)-60 పోస్టులు, మేనేజర్ (రిస్క్)-60 పోస్టులు, మేనేజర్ (సివిల్ ఇంజినీర్)-07 పోస్టులు, మేనేజర్ (ఆర్కిటెక్ట్)-07 పోస్టులు, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్)-02 పోస్టులు, మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)-01 పోస్టు, మేనేజర్ (ఫోరెక్స్)-50 పోస్టులు, మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)- 14, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)-25, అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్)-120 పోస్టులను భర్తీ చేయనుంది.

విద్యార్హతల విషయానికొస్తే ఆయా పోస్టులకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఆ బ్రాంచ్‌లో డిగ్రీ పీజీ ఉండాలి. పూర్తి వివరాలకోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే సీనియర్ మేనేజర్ (రిస్క్)కు అప్లయ్ చేసే వారి వయస్సు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించగా... మిగతా అన్ని పోస్టులకు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది. ఇక అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్), అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా నిర్ణయించారు.
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో పాస్ అయిన వారు గ్రూప్ డిస్కషన్ ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలు క్లియర్ చేయాల్సి ఉ:టుంది. యూనియన్ బ్యాంకులో స్పెషలిస్టు ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్న వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ముఖ్యతేదీలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 12 ఆగష్టు 2021
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 12 ఆగష్టు 2021
ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసేందుకు చివరి తేదీ: 3 సెప్టెంబర్ 2021
ఇక వేతనం విషయానికొస్తే:
సీనియర్ మేనేజర్ (రిస్క్)-రూ. 63840 - 1990/5 - 73790 - 2220/2 - 78230 (MMGS-III)
మేనేజర్ (రిస్క్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (సివిల్ ఇంజినీర్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (ఆర్కిటెక్ట్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (ఫోరెక్స్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)- రూ. 48170 - 1740/1 - 49910 - 1990/10 - 69810 (MMGS-II)
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)- రూ. 36000 - 1490/7 - 46430 - 1740/2 - 49910 - 1990/7 - 63840 (JMGS-I)
అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్)- రూ. 36000 - 1490/7 - 46430 - 1740/2 - 49910 - 1990/7 - 63840 (JMGS-I)
ఇక మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: (ఇందులో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌ను సందర్శించండి.)












Click it and Unblock the Notifications