UPSC ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) అభ్యర్థులకు బిగ్ అలెర్ట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
యూపీఎస్సీ సివిల్స్-2025 కు సంబంధించిన ప్రిలిమినరీ ఫలితాలు చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. హాల్ టికెట్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి.. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాక ఇండియన్ ఫారెస్టు సర్వీస్ లోని ఉద్యోగాల భర్తీ కోసం మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ బోర్డు విడుదల చేసింది. ఐఎఫ్ఎస్ కు క్వాలిఫై అయిన వారి లిస్టును కమిషన్.. అధికారిక సైట్ లో ఉంచింది.

యూపీఎస్సీ సివిల్స్-2025 కు సంబంధించిన ప్రిలిమినరీ ఫలితాలతో పాటు అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీలను ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక అప్ లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు రూ.200 రుసుం చెల్లించి వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. మహిళలు,దివ్యాంగులు,ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు జూన్ 16 నుంచి 25వరకు కమిషన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications