Education News: సంస్కృతానికి అక్కడ సముచిత స్థానం.. మదర్సాల్లో మౌల్వీలు, పండిట్‌ల బోధనలు

Sanskrit: వాడుకలో ఉన్న చాలా భాషలకు సంస్కృతాన్ని మూలంగా చెబుతారు. అయితే కాల క్రమంలో దాని ప్రాశస్త్యం కాస్త తగ్గిపోతోంది. పూర్వం విరివిగా ఉపయోగించే భాషను ప్రస్తుతం ఎవరూ మాట్లాడటం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృతం విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అది గనుక అమలైతే మళ్లీ సంస్కృతానికి మంచి రోజులు వచ్చినట్లేనని భాషా పండితులు పేర్కొంటున్నారు.

ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ (UMEB) ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 416 మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం అధికారికంగా చొరవ ప్రారంభించింది. ఈ మార్పును అమలు చేయడానికి రాష్ట్ర సంస్కృత శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తోంది.

Uttarakhand key decision over Sanskrit language

'బోర్డు ఇటీవల మదర్సాలలో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టింది. ఫలితంగా ఈ ఏడాది విద్యార్థులు 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించారు' అని UMEB చైర్‌పర్సన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ అభ్యసించే విద్యార్థులకు మరిన్ని అకడమిక్ పాఠ్యాంశాలను జోడించడంలో భాగంగా సంస్కృతంతో పాటు కంప్యూటర్ అధ్యయనాలను కూడా చేర్చాలని బోర్డు పరిశీలిస్తోంది. ఇది వారి విద్యా వృద్ధికి గణనీయంగా సహాయపడుతుందని ఆశిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. తదుపరి చర్యగా సంస్కృత శాఖతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించామని, త్వరలో సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఖాస్మీ తెలిపారు. ప్రభుత్వం ఆమోదం అనంతరం ఈ మదర్సాల్లో కొత్త పాఠ్యాంశాలను అమలు చేయడంతో పాటు సంస్కృత ఉపాధ్యాయులను నియమించడం ప్రారంభం అవుతుంది.

ఇప్పటివరకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ 416 మదర్సాలను లిస్ట్ చేసింది. ఇవి 70 వేల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. ఇవి కాకుండా అదనపు మదర్సాలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 100కి పైగా మదర్సాలలో అరబిక్ బోధించబడుతోంది. త్వరలో సంస్కృత తరగతులు కూడా ప్రారంభించగలిగితే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మౌల్వీలు మరియు పండిట్‌ల బోధనలతో వారి భవిష్యత్తు బంగారమవుతందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+