నవోదయలో ఖాళీలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలో నవోదయ స్కూల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఖాళీలను భర్తీ చేస్తారు. ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలాంటి రాతపరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 4 పోస్టులను భర్తీ చేస్తారు.

పీజీటీ కెమిస్ట్రీ విభాగంలో ఒక ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో బోధించగలగాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 వేతనం చెల్లిస్తారు. పీజీటి ఫిజిక్స్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో బోధించగలగాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 వేతనం చెల్లిస్తారు.

vacancies fill up in navodaya

మ్యాట్రన్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 35 నుంచి 50 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 18న గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లాలోని నవోదయ విద్యాలయలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రకటనలో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+