WIPROలో భారీ రిక్రూట్ మెంట్.. ట్రైనింగ్ తో పాటు 100 శాతం జాబ్..
బీటెక్ పూర్తిచేసిన వారికి గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ఎమ్ఎన్‌సీ కంపెనీల్లో ఒకటైన WIPRO నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. బ్యాక్ లాగ్స్ ఉన్నా స్టడీ గ్యాప్ ఉన్నా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అంతా ఈ జాబ్స్ కు అర్హులే. కంపెనీ యాజమాన్యం ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు 100శాతం ఉద్యోగం కూడా కల్పించనుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

WIPRO టర్బో హైరింగ్-2025 పేరుతో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ పొందిన ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. జాబ్ లొకేషన్ దేశవ్యాప్తంగా ఉంది. 2025లో బీటెక్ పూర్తి చేసిన లేక ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం సంవత్సరానికి రూ. 5.5లక్షల సీటీసీగా ఉంది. అంతేకాక ఒక లక్ష బోనస్ గా ఉంది. అప్లికేషన్ పూర్తి చేసుకున్నాక అర్హులైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://careers.wipro.com/ అధికారిక సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత:
అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2025 లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయి ఉండాలి. సీఎస్, ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెన్త్, ఇంటర్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థికి బ్యాక్ లాగ్స్ ఉన్నా.. 3 ఏళ్ల వరకు గ్యాప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది.
ఎంపిక: అభ్యర్థులకు ఆన్ లైన్ అసెస్ మెంట్, వాయిస్ అసెస్ మెంట్, బిజినెస్ డిస్కషన్ అనే మూడు రౌండ్స్ ఉంటాయి. బిజినెస్ డిస్కషన్ పూర్తయిన వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications