12 మంది హీరోలు వద్దంటే.. ఆ హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఏకంగా 12 మంది హీరోలు ఆ కథను తిరస్కరించారు. చివరకు ఆ హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు.. తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా మారిపోయాడు. అతనెవరంటే విభిన్న పాత్రలు పోషించే ప్రతిభావంతుడైన సూర్య. ఆ సినిమా ఏదంటే గజినీ. ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్ కథను రాసుకున్న తర్వాత తొలిసారిగా తెలుగు హీరోలతో చేద్దామని నిర్ణయించుకున్నాడు. వెంటనే హైదరాబాద్ వచ్చి మహేష్ బాబుకు కథను వినిపించాడు. అయితే కథ ప్రకారం ఒంటినిండా పచ్చబొట్లతో కనిపించాలి కాబట్టి ప్రిన్స్ తిరస్కరించాడు.

ఒక్కరు కూడా చేస్తాననలేదు
దీంతో మురుగదాస్ ఇదే కథను పవన్ కల్యాణ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అయితే పవన్ కూడా ఒంటినిండా పచ్చబొట్లు అనేసరికి వెనక్కి తగ్గాడు. దీంతో మురుగదాస్ ఈ కథను మార్పుచేర్పులు చేసి తమిళ నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్ది కమల్ హాసన్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అయినా కమల్ చేయనన్నాడు. తర్వాత రజనీకాంత్, విజయకాంత్, దళపతి విజయ్ కు కూడా కథను వినిపించినప్పటికీ వారంతా రిజెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమా చేయడం అవసరమా? అనే ఆలోచనతో కథను పక్కన పడేశాడు. తర్వాత దర్శకుడిగా తనకు మొదటి అవకాశం ఇచ్చిన అజిత్ దగ్గరకు తీసుకువెళదాం అనుకుంటూ వెళ్లి కథను చెప్పాడు.

12 heros rejected gajini movie

అజిత్ రెండు షెడ్యూల్స్ చేశాడు
అజిత్ కు బాగా నచ్చింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న సమయంలో నిర్మాతకు, అజిత్ కు భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి అజిత్ తప్పుకున్నాడు. అయినా మురుగదాస్ లో పట్టుదల పెరిగింది. ఎలాగైనా సినిమాను చేయాలనుకున్నాడు. ఆ సమయంలో మంచి మార్కెట్ సంపాదించుకుంటున్న సూర్య దగ్గరకు వెళ్లి కథను చెప్పాడు. సూర్యకు బాగా నచ్చడంతో పట్టాలెక్కింది. ఐదు నెలల్లో షూటింగ్ పూర్తిచేసుకొని, రెండు నెలల్లో ప్రీప్రొడక్షన్ పూర్తిచేసుకొని విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సూర్యకు తెలుగులో కూడా ఈ సినిమా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. రెండో హీరోయిన్ గా శ్రియ, విలన్ గా ప్రకాష్ రాజ్ అనుకున్నారు. కొన్ని కారణాలవల్ల వారిద్దరూ తప్పుకోవడంతో వారి స్థానంలో నయనతార, ప్రదీప్ రావత్ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+