మరో వివాదంలో అల్లు అర్జున్.. కావాలనే చేస్తున్నారా?
మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు విభేదాలున్నాయనే సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఉప్పునిప్పుగా ఉన్న విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భగ్గుమన్నాయి. ఆ తర్వాత కూడా సద్దుమణగలేదు. పుష్ప2 విడుదల కావడం, సంధ్య థియేటర్ లో తొక్కిసలాట, మహిళ మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడటం, తర్వాత బెయిల్ పై అల్లు అర్జున్ బయటకు రావడం, చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లడం... ఇలా వరుసగా పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ను కలవలేదు. కలవడానికి పవన్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఇందులో బాధ్యతా రాహిత్యమే కనిపిస్తోందని, మానవత్వం లోపించినట్లు కనపడుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
కావాలనే చేస్తున్నారా?
ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలను మైత్రీ మూవీస్ మరోసారి ఎగదోస్తోంది. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు నిర్మాత మైత్రీ మూవీస్ ప్రత్యర్థి దిల్ రాజు. దీంతోపాటు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలవుతున్నాయి. కొత్తగా 20 నిముషాల సన్నివేశాలను పుష్ప2కు యాడ్ చేస్తున్నారు. జనవరి 11వ తేదీ నుంచి థియేటర్లలో వీటిని ప్రదర్శించబోతున్నారు. ఒకరకంగా కొత్త సినిమాల కలెక్షన్లను దెబ్బతీసి పుష్ప2 కలెక్షన్లను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఇలా చేస్తున్నారు. ఇది వారి వ్యాపారం. అయితే హీరో, దర్శకుడు అంగీకరించకుండా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత ముందుగాకానీ, లేదంటే కొంత ఆలస్యంగా కానీ సన్నివేశాలను యాడ్ చేస్తే ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇచ్చినట్లు ఉండేదికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనవరి 1 నుంచి యాడ్ చేస్తే బాగుండేది
గేమ్ ఛేంజర్ విడుదలవుతోంది కాబట్టి కావాలనే పుష్ప2 సన్నివేశాలను జోడించి విడుదల చేస్తున్నారని, విభేదాలను పెంచుకోవడమేకానీ తగ్గించుకునే ఉద్దేశం అల్లు అర్జున్ కు లేదని దీనిద్వారా స్పష్టమవుతోందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఒకవేళ సన్నివేశాలను సినిమాకు యాడ్ చేయాలనుకుంటే జనవరి 1వ తేదీ నుంచి యాడ్ చేసుకొని ఉంటే మరింత కలెక్షన్లు పెరిగేవని, సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినా పాత సినిమాకు ప్రేక్షకులు రారని, కొత్త సినిమాలవైపే మొగ్గుచూపుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తాజాగా జరుగుతున్న పరిణామాలతో మరోసారి మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications