2023లో టాలీవుడ్ లో టాప్-3 గొడవలు ఇవే
చలనచిత్ర పరిశ్రమ అన్న తర్వాత వివాదాలు సహజంగానే ఉంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని గొడవలు పరిశ్రమనే షేక్ చేశాయని చెప్పవచ్చు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అన్నారు. ఇది అక్కినేని అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది. నాగేశ్వరరావును బాలకృష్ణ అవమానించారని, క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ ధర్నాలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ సైతం సున్నితంగా సోషల్ మీడియా ద్వారా ఖండించారు. చివరకు బాలకృష్ణ మాత్రం క్షమాపణలు చెప్పలేదు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు-సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి తెర తీశాయి. చిన్న నిర్మాతలను దిల్ రాజు తొక్కేస్తున్నారని, వారిని ఎదగనివ్వడంలేదంటూ సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆయన వీడియో బైట్ విడుదల చేశారు.

సమంత ఆరోగ్యంపై నిర్మాత చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమెకు వచ్చిన మయోసైటిస్ అనేది ఒక సాధారణ వ్యాధి అని, ప్రతి సినిమా విడుదలవడానికి ముందు సింపతీ కోసం అనారోగ్యాన్ని తెరపైకి తెస్తుందని, ఆమె స్టార్ డం ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. ఆమెకు ఆఫర్స్ కూడా రావని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ కు సమంత గట్టి కౌంటర్ ఇచ్చింది. వయసు పెరిగేకొద్దీ పురుషులకు చెవుల్లో వెంట్రుకలు పెరుగుతాయని దానికి కారణం టెస్టోస్టిరాన్ అని చెబుతారని, ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంతను విమర్శించిన చిట్టిబాబుకు చెవుల్లో భారీగా వెంట్రుకలు ఉంటాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో సమంతకు మద్దతుగా ఆమె అభిమానులు ట్వీట్లో హోరెత్తించారు. అలాగే మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా సామ్ కు మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications