బాహుబలి సృష్టించిన 9 రికార్డులు ఇవే

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి భారతీయ సినీతెరపై అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించగా విజయేంద్రప్రసాద్ రచన అందించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. 2015లో మొదటి భాగం విడుదలవగా, 2017లో రెండో భాగం విడుదలైంది. రెండు భాగాలకు కలిపి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం రూ.1607 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో సృష్టించిన పది రికార్డుల గురించి తెలుసుకుందాం.

1. అన్ని భాషల్లో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.కోట్లు సంపాదించిన ఏకైక చిత్రంగా బాహుబలి2 నిలిచింది.

7 years bahubali 2 created rew records in indian film industry

2. ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్ లలో విడుదలైంది. గతంలో 4350 థియేటర్లలో సల్మాన్ ఖాన్ నటించి సుల్తాన్ విడుదలవగా బాహుబలి ఆ రికార్డును బద్దలు కొట్టింది.

3. భారతీయ సినీ చరిత్రలో ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేసిన మొదటి సినిమాగా చరిత్రకెక్కింది.

4. అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఖాన్ త్రయానికి సంబంధించిన సినిమాలు రూ.100 కోట్లు రాబట్టాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. అలాంటి బాహుబలి2 ఒక్కరోజులోనే రూ.125 కోట్లు వసూలు చేసింది. నాలుగు రోజుల్లో రూ.530 కోట్లు రాబట్టింది.

5. దేశం మొత్తంమీద ఈ సినిమాకు ఉన్నంత క్రేజ్ మరి ఏ సినిమాకు రాలేదు.

6. బాహుబలి 2 సినిమాకి కంపెనీలు సెలవులు ప్రకటించాయి.

7. బాహుబలి 2 కి సంబంధించిన పోస్టర్ , ట్రైలర్, టీజర్ యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేశాయి. బాహుబలి2 ట్రైలర్ ఇండియా మొత్తంమీద పాపులర్ అయింది.

8. భారతదేశంలో అత్యంత ఖరీదు పెట్టి టికెట్స్ కొనుగోలు చేసిన చిత్రం ఇదే. ఒక్కో టికెట్ మల్టీప్లెక్స్ లో రూ.700 నుంచి రూ.1000గా అమ్మకాలు జరిగాయి.

9. అమెరికాలో 800 స్క్రీన్ లలో విడుదలైన ఏకైక ఇండియన్ సినిమాగా బాహుబలి 2 రికార్డు సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+