జగన్ అభిమానుల దెబ్బకు దిగొచ్చిన ప్రముఖ నటుడు.. క్షమాపణలు కోరిన వైనం

ఇటీవల కాలంలో సినిమాల్లో రాజకీయల ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోంది. సినిమాల పేరుతో రాజకీయ నాయకులపై పొలిటికల్ సెటైర్లు వేయడం మన తెలుగు సినిమాల్లో పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఏపీలో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఇటువంటి విద్వేష వాతావరణం కనిపిస్తోంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో సీఎం జగన్‌కు సంబంధించి వెటకారంగా డైలాగులు చెప్పడం..దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని మనం చూస్తునే ఉన్నాం. జగన్‌పై చేస్తున్న విమర్శలకు వైసీపీ సోషల్ మీడియా సైతం గట్టిగానే తిప్పికొడుతుంది

సెంకడ్ గ్రేడ్ నటులు సైతం జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ వర్ధమాన నటుడు ఏపీకి రాజధాని ఎక్కడా అంటూ ఓ సెటైరికల్ వీడియో చేశారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఇటీవల ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో శివాజీ కొడుకుగా నటించిన మౌళికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. మౌళి టాక్స్ పేరిట మనోడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియోస్ చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు.

90s kids actor issues apology for controversial political comments

అయితే కావాలని చేశాడో.. పొరపాటునా చేశాడో తెలియదు కాని.. మౌళి ఏపీ రాజధాని గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. ఏపీ క్యాపిటల్ చూసుకోండి కావాలంటే ఎక్కడ దొరకదంటూ ఓ కామెడీ వీడియో చేశాడు. దీంతో ఈ వీడియోను టీడీపీ తమకు అనుకులంగా మార్చుకుని తమ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాకు మౌళి ఒక్కసారిగా టార్గెట్ అయ్యాడు.

అతను చేసిన వీడియోపై వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున ట్రోలింగ్‌ చేశారు. దీనిపై దిగొచ్చిన నటుడు మౌళి.. క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. నేను సరదాగా ఆ వీడియోను చేశానని.. దాన్ని ఇలా కొందరు రాజకీయానికి వినియోగించుకుంటారని అనుకోలేదని...ఎవర్ని కించపర్చాలనేది తన ఉద్దేశం కాదని మౌళి చెప్పుకొచ్చాడు. నా వీడియో ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరాడు. దీనిపై సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+