'దేవర'.. ఆ 40 నిముషాలు మెంటలెక్కించిన ఎన్టీఆర్!

స్టైలిష్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం దేవర. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. రెండు భాగాలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అందులో మొదటి భాగం 27న రాబోతోంది.

చిన్న క్లూ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
ట్రైలర్ విడుదల సందర్భంగా తారక్ ఈ సినిమాకు సంబంధించి చిన్న క్లూ ఇచ్చారు. చివరి 40 నిముషాలు థియేటర్లు ఊగిపోతాయని చెప్పడంతో అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అంత ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఆ 40 నిముషాల గురించి చెప్పారంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరకు క్లైమాక్స్ వరకు సినిమా సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో నడవనుందని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో పోరాట దృశ్యాలను కొరటాల శివ తీర్చిదిద్దినట్లు సమాచారం.

A 40 minute episode that became the key to the ntr Devara movie

చివరి 40 నిముషాల్లోనే బయటపడనుంది
ఎన్టీఆర్ పాత్ర ఉద్దేశమేంటి అనేది ఈ చివరి 40 నిముషాల్లోనే బయటపడనుందని, పెద్ద ఎన్టీఆర్ కు శివ భయంకరమైన ఎలివేషన్లు ఇచ్చాడని, అలాగే అనిరుధ్ రవిచదర్ బీజీఎం ఒక రేంజ్ లో ఉండబోతోందంటున్నారు. దేవర కొడుకు పిరికితనంతో ఉంటాడనే సంగతి తెలిసిందే. ఇక్కడే పిరికితనం నుంచి అత్యంత పరాక్రమవంతుడిగా మారే సన్నివేశం కూడా ఉండబోతోంది. అయితే దర్శకుడు ఇద్దరు ఎన్టీఆర్ ల క్యారెక్టరైజేషన్లలో పోలిక కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఊరి జనం కోసం అవసరమైతే తల ఇవ్వడానికి లేదంటే తల తీయడానికైనా సిద్ధపడే పాత్రే దేవర. క్లైమాక్స్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇప్పటికే సెన్సార్ సభ్యులు చెప్పిన విషయం తెలిసిందే. మరో 15 రోజులు ఓపిక పడితే సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అప్పటివరకు వేచిచూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+