శివాజీపై వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్న తెలుగు అగ్ర కథానాయకుడు

దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకన్నా, అవి చెప్పే క్రమంలో వాడిన రెండు పదాల వల్లే అత్యంత వివాదాస్పందంగా అవి మారాయి. దీంతో మహిళా కమిషన్ ముందు హాజరై శివాజీ వివరణ ఇచ్చుకున్నారు. అనసూయ, చిన్మయిలాంటివారంతా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. వీరికితోడు నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ... ఇలా చాలామంది మాట్లాడారు. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలోని ఒక అగ్ర కథానాయకుడు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని, ఒక రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇదంతా చేయించినట్లు తెలుగు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా చెప్పేవాడు
ఆ రాజకీయ పార్టీ అధినేతతో ఈ అగ్ర హీరోకు వ్యాపార సంబంధాలున్నాయి. బయటకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, పరిశ్రమలో మాత్రం చాలా అనుకూలంగా పనిచేస్తుంటారని అందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీ అధినేతకు, శివాజీకి గతంలో చాలా విభేదాలున్నాయి. అవి ఏ స్థాయిలో అంటే ఆ రాజకీయ పార్టీ అధినేత రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా శివాజీ తెలుసుకొని బహిరంగంగా వెల్లడించేవారు. సమయం కోసం వేచిచూస్తున్న ఆ పార్టీ నేత తనకు అనుకూలుడైన హీరోను రంగంలోకి దింపారు. దీంతో ఇంకేముంది.. అందరూ నోరేసుకొని శివాజీపై పడిపోయారు. కానీ వాస్తవానికి ప్రజల నుంచి శివాజీకే మద్దతు లభించింది. అది కూడా ఎంతలా అంటే.. ఏపీ, తెలంగాణలోని 99 శాతం ప్రజలు శివాజీ వ్యాఖ్యలను సమర్థించారు. శివాజీ కాబట్టి ఆ రెండు పదాలతో సరిపెట్టారు సంతోషించండి.. మేమైతే అత్యంత దారుణమైన పదాలు వాడేవారిమంటూ అతిగా స్పందించిన అనసూయ, చిన్మయిలాంటివారిపై విరుచుకుపడ్డారు.

A leading Telugu actor is orchestrating a negative campaign against Shivaji

తన బ్యాండు మేళాన్ని రంగంలోకి దింపిన హీరో
ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనే విషయం శివాజీకి తెలుసు. అయినప్పటికీ అతను మౌనంగానే ఉన్నాడు. సమాజానికి రెండు మంచిమాటలు చెప్పాలనుకోవడం కూడా తప్పయినప్పడు మౌనంగా ఉండటమే మంచిదనేది అతని భావన అయివుండొచ్చు. అయినా వ్యాఖ్యలకే ఆ హీరో తన బ్యాండుమేళాన్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించడం, తర్వాత ప్రజల నుంచి అనూహ్యంగా శివాజీకే మద్దతు లభించడంతో వెంటనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం మానేశారు. ఇంకా ఎక్కువ చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని వారు భావించారు. ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలు విని తాము చెడ్డపేరు తెచ్చుకోవాల్సి వస్తుంది.. పేరు బయటకొస్తే పరువుపోతుందని మిన్నకుండిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+