రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు నా భర్త అలా చేస్తున్నాడు..అందుకే విడాకులిచ్చా - స్టార్ హీరోయిన్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. షూటింగ్ సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత చేసుకున్న వారితో కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో సూపర్ స్టార్ జంట వచ్చి చేరింది. విచిత్రం గురక పెడుతున్నాడని చెప్పి తన భర్తకు విడాకులిచ్చింది ఓ స్టార్ నటి. ఆమె మరెవరో కాదు..అమెరికన్ బిజినెస్ ఉమెన్, సోషల్ మీడియా ఐకాన్ కిమ్ కర్దాషియన్.

కిమ్ కర్దాషియన్ తన మాజీ భర్త, ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్‌కి విడాకులు ఇవ్వడానికి గల అసలు కారణాన్ని ఇటీవల ఒక మీడియా సమావేశంలో వెల్లడించింది. విన్నవారికి షాక్ తగిలింది. కెన్యే ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం, ముఖ్యంగా గురక పెట్టడమే అని ఆమె తెలిపింది. కిమ్ మాట్లాడుతూ, "అతను బాత్రూమ్‌లో, రెస్టారెంట్‌లో, హోటల్‌లో, ఇలా ఎక్కడైనా కూర్చున్న చోటే కునుకేస్తాడు. నాకు రొమాంటిక్ మూడ్ ఉన్నప్పుడు కూడా అతనికి నిద్ర వస్తుంది.
స్నేహితులు ఇంటికి వచ్చినా, మీటింగ్‌లలోనూ, ట్రిప్‌లలోనూ జనరేటర్‌లా శబ్దం చేస్తూ గురక పెట్టడం వల్ల చాలా అసహనంగా అనిపించేది" అని పేర్కొంది. ఈ నిద్ర అలవాటు కారణంగానే తమ దాంపత్య జీవితం దెబ్బతిందని ఆమె వివరించింది.ఈ గురక శబ్దం వల్ల చాలాసార్లు ఇబ్బందికరంగా ఫీలైనట్లు కిమ్ స్పష్టంగా చెప్పింది. గతంలో అన్యోన్య దంపతులుగా పేరు పొందిన వీరిద్దరూ, కేవలం నిద్ర, గురక వంటి కారణాలతో విడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications