Hyderabad: బిగ్ బాస్‍లో అవకాశం కల్పిస్తానని యాంకర్‍ను మోసం చేసిన వ్యక్తి..

ప్రముఖ ఎంటైన్మెంట్ ఛానల్ లో పని చేస్తున్న ఓ వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తమిలి రాజు అనే వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 7 లోకి తనను పంపిస్తానంటూ డబ్బులు తీసుకుని తనను మోసం చేశారంటూ యాంకర్ అమ్మినేని స్వప్న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్‌ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్‌ ఇన్‌చార్జి తమిలి రాజు స్వప్నకు పరిచయమయ్యారు. బిగ్‌ బాస్‌ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని కోరినట్లు స్వప్న తెలిపారు. దీంతో స్వప్న గత ఏడాది జూన్‌ నుంచి దాదాపు రెండున్నర లక్షలు రాజుకు చెల్లించారు.

A person who works in Maa tv cheated the anchors dream of giving him a chance in Bigg Boss

ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు హామీ ఇచ్చాడు. ఒక ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. చివరి నిమిషంలో తనను షోలో పంపిస్తానని చెప్పి రాజు మోసం చేశాడంటూ స్వప్న ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు డబ్బులు తీసుకున్న విషయం టీవీ ఛానల్ వారికి తెలియడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజుపై సెక్షన్‌ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేశారు.

కాగా ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న ... యాంకర్ గా, ఈవెంంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆమెకు రాజు పరిచయమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+