నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా ?, ఇంతకి ఆ బ్యూటీషియన్ ని ఏం చేశాడంటే, దెబ్బకు రెండు బాషల్లో ?

బెంగుళూరులోని ఓ బ్యూటీ సెలూన్‌లో పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకుంటానని, సినిమాలలో నీకు నటిగా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను మోసం చేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్న తమిళ చిత్రాల్లో, కన్నడ సినిమాల్లో నటించిన నటుడు సంతోష్‌పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకాలం నటుడు సంతోష్ తో తిరుగుతూ అతను చెప్పినట్లు ఆడిన యువతి ఇప్పుడు కుయ్యోమొర్రో అంటూ పోలీసులను ఆశ్రయించింది.

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతి బెంగళూరులోని ఉల్లాల్ ప్రాంతంలో నివాసం ఉంటూ అదే బెంగళూరులోని బసవేశ్వర నగర్‌లోని ఓ బ్యూటీ సెలూన్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆ యువతికి ఇంకా పెళ్లి కాలేదు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలేకి చెందిన సంతోష్ అనే యువకుడు కన్నడ, తమిళ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో సంతోష్ నటిస్తున్నాడని తెలిసింది.

A young woman filed a case against film actor Santhosh for cheating her to marry him
అయితే ఓ స్నేహితురాలి ద్వారా బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న యువతితో 2019లో సంతోష్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సంతోష్, బ్యూటీషియన్ యువతి ఇద్దరూ సెల్ ఫోన్ నంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రానురాను ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ బయటకు వెళ్లడం, విహారయాత్రలకు, సినిమాలు, షికార్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అలా వారి మధ్య బంధం మరింత దగ్గరైంది. ఇద్దరూ ఇంకా చాలా దగ్గరవ్వడం మొదలుపెట్టారు.

ఆ సమయంలో సంతోష్ ఆ యువతిపై అతనికి ఉన్న ప్రేమను బయటకు చెప్పాడని తెలిసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, దాంతో పాటు సినిమాల్లో నటిగా నిన్ను పరిచయం చేస్తానని, నిన్ను పెద్ద నటిని చెయ్యాలని అనుకుంటున్నానని ఆమెకు అశలు కల్పించి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాడు. ఆ యువతి కూడా నటన పట్ల మక్కువ చూపింది. అయితే సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించాలి? అనే విషయం ఆ యువతికి తెలీలేదు.

అలాంటి వాతావరణంలో సంతోష్ మాటలు ఆమెలో ఇంకా ఆశలు నింపాయి. దీంతో యువతి అతడిపై నమ్మకం పెంచుకుంది. సంతోష్ ప్రేమను ఆ యువతి అంగీకరించింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ బయటికి వెళ్లి ప్రైవేట్ హోటళ్లలో కలిసి ఉంటున్నారు. అలాగే ఇద్దరూ కలిసి సెల్‌ఫోన్లలో ఒకరికి ఒకరు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. యువతికి తెలియకుండా సంతోష్ సెల్‌ఫోన్‌లో ఆమె అసభ్యకరమైన, అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆరోపణలు ఉన్నాయి.

A young woman filed a case against film actor Santhosh for cheating her to marry him

తరువాత రానురాను సంతోష్ తీరులో మార్పు వచ్చింది. అంటే సంతోష్ సినిమాలో అవకాశం కల్పిస్తానని చెప్పినా ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యువతికి అనుమానం వచ్చింది. దీని గురించి అడిగితే సంతోష్ చాకచక్యంగా ఆమెను దారితప్పించే మాటలు మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకునేవాడు. తరువాత తనతో ఒంటరిగా బయట కలవాలని తరచుగా సంతోష్ ఆ యువతిని బలవంతం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భయపడిన యువతి సంతోష్ కు దూరంగా వెళ్లిపోయింది.

తనతో మాట్లాడవద్దని ఆ యువతి సంతోష్ కు గట్టిగా చెప్పింది. కానీ సంతోష్ మాత్రం ఆమెను వదలకుండా ఆ యువతికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ నుంచి బయటకు రమ్మని సంతోష్ బలవంతం చేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. తనతో రాకపోతే సన్నిహితంగా ఉన్న నీ నగ్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, పలు వెబ్‌సైట్లలో పోస్టు చేస్తానని సంతోష్ బెదిరించాడని యువతి ఆరోపిస్తోంది.

A young woman filed a case against film actor Santhosh for cheating her to marry him

అయితే సంతోష్ చెప్పినట్లు వినడానికి యువతి నిరాకరించింది. తరువాత సంతోష్ అతని గర్ల్ ఫ్రెండ్ ఉండే బసవేశ్వరనగర్ ప్రదేశానికి వెళ్లి ఆమెను వేధించాడు. సంతోష్ టార్చర్ ఎక్కువ కావడంతో గతేడాది జూన్‌లో ఆమె బెంగళూరు పోలీసులకు అతని మీద ఫిర్యాదు చేశారు. కానీ బెంగళూరు సిటీ పోలీసులు నటుడు సంతోష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ యువతి ఆరోపించింది.

ఈ క్రమంలో సంతోష్ మళ్లీ యువతిని వేధిస్తున్నాడు. అయితే ఇప్పుడు బెంగళూరులోని జ్ఞానభారతి పోలీసులకు ఆ యువతి నటుడు సంతోష్ మీద మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నటుడు సంతోష్‌కు సమన్లు ​​చేసేందుకు బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సంతోష్ చెన్నై చేరుకున్నాడని తమిళ మీడియా అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+