AK47 TEASER: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. త్రివిక్రమ్ రఫ్పాడించాడు భయ్యో..!
విక్టరీ వెంకటేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. ఈ మూవీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఈ మూవీలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆదర్శ కుటుంబం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆదర్శ కుటుంబం టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ చాలా రీ ఫ్రెషింగ్ గా ఉంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. డబ్బుకు సబ్బుకు ఓ పోలిక ఉంది. మొదటిది చూస్తుండగానే కరిగిపోద్ది.. రెండోది ఆలోచించే లూపే అరిగిపోద్ది అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ గా వెంకటేశ్ ఈ మూవీలో అదరగొట్టినట్లు తెలుస్తోంది. చిట్టిబాబు ఏంటి లేటు అంటే క్యారేజీ అని.. అడుక్కునేవాడికి కూడా ఆదివారం ఉంటుంది కానీ ఈ అప్పులోళ్ల మాత్రం ఉండదు.. అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నది గట్టు దాటితే వరద అంటారు. అదే సముద్రం దాటితే ఉప్పెన అంటారు. అదే సామాన్యుడు దాటితే.. బలమైన పదం.. సౌండ్ వచ్చేది మీరే వెతకండి సార్.. దొరికితే వాట్సాప్ చేయండి.. అనే చివరి డైలాగ్ బాగుంది. మొత్తానికి ట్రైలర్ లో ఫన్, ఫ్యామిలీ తో పాటు ఏదో తెలియని క్రైమ్, మిస్టరీ కూడా ఉన్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
ఈ చిత్రానికి తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఆదర్శ కుటుంబం మూవీ కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో కుటుంబమంతా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ఇటీవల వైరల్ అవుతోంది. ఇందులో ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతోపాటు వెంకటేశ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు తెలుస్తోంది. తారక్ వాయిస్ ఓవర్ వార్త నేపథ్యంలో సినిమాపై బజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications
