రాబిన్ హుడ్ రిలీజ్ వేళ నితిన్ కి షాక్ .. సారీ చెప్పిన హీరో !
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన చిత్రం 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరించేందుకు నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా.
అయితే మూవీ రిలీజ్ సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం నితిన్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూనే క్షమించమని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యంగ్ హీరో ఆది పినిశెట్టి నితిన్ కి సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. ఈ మేరకు ఆ పోస్టులో.. రాబిన్ హుడ్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. దయచేసి నితిన్ నన్ను ఒక విషయం లో క్షమించాలి. గత నెలలో శబ్దం సినిమా విడుదల సందర్భంగా నన్ను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉండడం వల్ల రిప్లైని ఇవ్వలేకపోయాను అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే.. మొదటి నుంచి ఈ సినిమా విషయంలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మరో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ 'అది దా సర్ప్రైజ్' అంటూ స్పెషల్ సాంగ్ చేయగా.. అందులోని స్టెప్పులు అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ వివాదం నడిచింది. ఫేమస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్ లో చేయడం ప్లస్ అయితే.. రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఆయనపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకే తెరలేపాయి.
Brotherrrr.....thanks a lot for the tweet and iam extremely sorry for missing on replying to this....#Sabdham movie did not release on the first day in TN and I was zoned out trying to solve the issue!!!
— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2025
Wishing you a grand success for #Robinhood and iam sure its gonna be super… https://t.co/Yti8NxMhwS
అలానే గత కొంతకాలంగా శ్రీలీలకి మంచి హిట్ దక్కలేదు. నితిన్ కి సైతం గత చిత్రాలు ఘోర పరాజయాల్ని కట్టబెట్టాయి. దీంతో మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందా ని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఉగాది, రంజాన్, శ్రీ రామనవమి వంటి పండుగలు వరుసగా ఉండడం భారీ ప్రాజెక్టులు లేకపోవడం ఈ మూవీకి కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications