ఇక మీ కెరీర్ ముగిసిపోయినట్లేనా? నెటిజన్‌‌కు ఆది సాయికుమార్ స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి చిత్ర పరిశ్రమలోనూ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇతర టెక్నీషియన్లు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వీరిలో కొందరు స్టార్స్‌గా వెలుగొందితే.. మరికొందరు మాత్రం రెండు మూడు సినిమాలకే పక్కకు తప్పుకున్నారు. ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లల పరిస్ధితి కూడా ఇందుకు అతీతం కాదు. బ్యాక్‌గ్రౌండ్ అనేది కేవలం అరంగేట్రం వరకే పనికొస్తుందని తర్వాత నిలబెట్టేది కష్టం, ప్రతిభ, ప్రజల ఆశీస్సులు మాత్రమేనని ఎందరో విషయంలో రుజువైంది.

డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఆది సాయికుమార్. ప్రేమకావాలితో హీరోగా అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఘన విజయం అందుకున్నారు. తర్వాత లవ్లీ, సుకుమారుడు వంటి వరుస హిట్స్‌తో దూసుకొచ్చారు ఆది. కానీ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కథల ఎంపికలో పొరపాట్లు, ఇతర కారణాలతో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆయన నటించిన సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి. ఈ దశలో ఆది కెరీర్ ఇక ముగిసినట్లేనా అని సినీ విశ్లేషకులు భావించారు.

Aadi Saikumar Hits Back at Trolls Says Learn to Encourage Instead of Pulling Others Down

పెద్దలు, స్నేహితుల సలహాలతో మంచి కథలు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఆయనకు హిట్ మాత్రం దొరకలేదు. ఈ దశలో గతేడాది వచ్చిన శంబాల మూవీతో హిట్ అందుకున్నారు. దాదాపు పదేళ్లకు పైగా ఎదురుచూసిన నిరీక్షణకు సరైన ఫలితం అందుకున్నారు ఆది. ఆయన విజయంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు ఎంతో సంతోషించారు. శంబాల హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న ఆది.. ఈ సక్సెస్‌ను ఇలాగే కంటిన్యూ చేయాలని భావించారు. కానీ తర్వాత చేసిన యుగంధర్‌తో మరోసారి ఫ్లాప్ అందుకున్నారు ఆది. గాంధీ జయంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అసలు వచ్చినట్లు కూడా జనాలకు తెలియలేదు. అదే రోజున చాలా సినిమాలు విడుదల అవుతుండటంతో థియేటర్లు కూడా సరిగా దొరకలేదని ఫిలింనగర్ టాక్.

ఈ నేపథ్యంలో ఆది కెరీర్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ దారుణంగా పోస్ట్ పెట్టాడు. నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, నేను ఇప్పుడు ప్యాంట్‌లు వేసుకుంటున్నా, నువ్వు మాత్రం అక్కడే ఆగిపోయావు అంటూ ట్రోలింగ్ చేశాడు. దీనికి ఆది ఘాటుగా బదులిచ్చారు. ప్రతి నటుడి ప్రయాణం వెనుక ఓ కథ, ఎవరికీ తెలియని పోరాటం ఉంటాయి. నాని అన్న, రవన్న లాంటి హీరోలు ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అలాగని వాళ్లు పనికిరాకుండా పోతారా? వారి కెరీర్ ముగిసిపోయినట్లేనా? నటుడు అన్నాక ఇలాంటి వైఫల్యాలు సహజం. ఎదుటివారిని కిందకి లాగడం కాదు.. అండగా నిలవటం నేర్చుకోండి. సినిమా అనే ప్రయాణంలో విజయాలు అపజయాలు సహజ ప్రక్రియ. కానీ ఇలాంటి విషపూరిత ప్రవర్తన కారణంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ఫ్యాన్ వార్స్‌కు వేదికైంది. ప్రతి ఒక్కరి కష్టాన్ని, వారి ప్రయాణాన్ని గౌరవించడం నేర్చుకోండి అంటూ ఆది సాయికుమార్ చురకలు అంటించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుండగా .. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆదికి అండగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+