Aamir Khan : కుమార్తె పెళ్లిలో కంటతడి పెట్టిన అమీర్‌ఖాన్ (వీడియో)..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. అమీర్‌ఖాన్ కూతురు ఐరాఖాన్ ప్రియుడిని పెళ్లిచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి వివాహం గతవారం ముంబయిలోని ఓ హోటల్‌లో ఎంతో వైభవంగా జరిగింది. అయితే, ఈ జంట మరోసారి పెళ్లిచేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. కూతురు ఐరాఖాన్ పెళ్లి సందర్భంగా అమీర్‌ఖాన్ ఎమోషనల్ అయ్యారు. వధువరూలిద్దరూ ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో అమీర్‌ఖాన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గత వారం ముంబయిలో అమీర్ ఖాన్ - రీనా దత్తా కూతురు ఐరాఖాన్ ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుంది. ముంబయిలోని ఈ ఓహోటల్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే, ఐరాఖాన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తంతు తర్వాత అదే హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అమీర్‌ఖాన్, తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందులో ముఖ్యంగా ముఖేశ్-నీతా అంబానీ దంపతులు హాజరై కొత్త జంటను దీవించారు.

మరోసారి పెళ్లిచేసుకున్న జంట :ఇప్పుడు తాజాగా మరోసారి ఈ జంట వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నూతన వధువరులు పెళ్లితంతు ముగించారు. ఐరాఖాన్, నుపుర్ శిఖరేలు పెళ్లి తంతులో భాగంగా ఉంగరాలు మార్చుకుంటున్న క్రమంలో అమీర్‌ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువరూలిద్దరూ ఉంగరాలు మార్చుకునే క్రమంలో అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండడం మనకు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications