ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమాలో విలన్‌గా అమీర్ ఖాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2 చేస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డిసెంబరు నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మించబోయే చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాను రూ.1200 కోట్ల భారీ బడ్జెట్ తో 18 దేశాల్లో విడుదల చేయాలోనే యోచనలో దర్శక, నిర్మాతలున్నాయి. అందుకు తగినట్లుగానే నిర్మాణ విలువలు కూడా అత్యున్నతంగా ఉండేలా చూసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. రవి బ్రసూర్ సంగీతాన్ని అందిస్తుండగా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయికానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
నవరసాలను అద్భుతంగా పోషించే తారక్
ఈ సినిమాలో విలన్ పాత్ర అత్యంత కీలకం. తారక్ నవరసాలను అద్భుతంగా పోషించగల నటుడు. విలన్ పాత్ర కూడా అన్ని రసాలను అద్భుతంగా పోషించగలిగే స్థాయిలో ఉండాలనేది దర్శకుడి ఆలోచన. ఆ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ సరిపోతాడని భావిస్తున్నారు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమాను అమీర్ తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్తులోను నిర్మాతగా వరుసగా సినిమాలు తీయాలనే ఆలోచనలో అమీర్ ఖాన్ ఉన్నారు. బాలీవుడ్ కు చెందిన సూపర్ స్టార్లు తెలుగు సినిమాల్లో విలన్లుగా మారిపోతున్నారు. బాబీడియోల్, వివేక్ ఓబెరాయ్, ఇమ్రాన్ హష్మి, సైఫ్ అలీఖాన్ లాంటివారంతా తెలుగు సినిమాల్లో తమ విలనిజాన్ని అద్భుతంగా పండించారు.

అమీర్ ఖాన్ ఒప్పుకున్నారా?
అమీర్ ఖాన్ తో సంప్రదింపులు జరిగిన విషయం అధికారికంగా బయటకు రాలేదు. అధికారికంగా అమీర్ ఖాన్ నటిస్తున్నారనే వార్త బయటకు వస్తే అది పాన్ ఇండియాను షేక్ చేసే వార్త అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమీర్ ఖాన్ చేస్తారా? లేదా? అనే టెన్షన్ లో తారక్ అభిమానులున్నారు. ఇండియా, చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ డీలర్ కథతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాను ఆ దేశాల్లో కూడా విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత సితార బ్యానరులో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను తారక్ చేయబోతున్నారు. దాదాపుగా ఇది ఖరారైనట్లే. హీరోయిన్ ఎవరనేది చూడాలి.












Click it and Unblock the Notifications