ఆ హీరోయిన్‌వల్లే విడాకులు తీసుకోబోతున్న అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్?

అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని వీరిద్దరూ ఖండించారు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలను పరిశీలిస్తే వీరిద్దరి మధ్య సఖ్యత లేదని భావిస్తున్నారు. ఈ జంటకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఏదో ఒక విషయం వైరలవుతూనే ఉంది. ఐశ్వర్యారాయ్ ను అభిషేక్ మోసం చేశాడని, అందుకే వారి వివాహ బంధం సజావుగా సాగడంలేదని వార్తలు వస్తున్నాయి. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ వివాహ వేడుకల్లో కూడా ఐశ్వర్యరాయ్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

దాస్విని చిత్రంలో కలిసి నటించారు
2022 సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ దాస్విని చిత్రంలో నటించారు. ఆ సినిమాతో అభిషేక్ తో కలిసి పనిచేసింది నిమ్రత్ కౌర్. ఇప్పుడు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిమ్రత్ కౌర్ వల్లే అభిషేక్ ఐశ్వర్యను మోసం చేశాడని, ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసించడంలేదని తెలుస్తోంది. నిమ్రత్ కౌర్ ఎయిర్ లిఫ్ట్ సినిమా సమయంలో కూడా అక్షయ్ కుమార్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. వీటిల్లో వాస్తవం ఎంతో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ గా మారింది.

Abhishek Bachchan-Aishwarya Rai is going to divorce because of that heroine nimarat kaur

అంబానీ వేడుకకు విడివిడిగా వచ్చారు
ఇటీవలే జరిగిన ముకేష్ అంబానీ - నీతా అంబానీ చిన్న కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహానికి కూడా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి వచ్చింది. ఇదే వేడుకకు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలంతా కలిసి వచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య విడిగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుమార్తెను ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే విదేశాల్లో జరిగిన వేడుకకు తీసుకువెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+