ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు..? వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి.

Abhishek Bachchan and Aishwarya Rai latest video viral

తాజాగా ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై అభిషేక్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ..మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఐశ్వర్యకు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ తెలిపారు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు.. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్‌‌ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేనంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్. తాజాగా వీరిద్దరు కలిసున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. కూతురిలో వీరిద్దరు దుబాయ్ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+