ఆమె జీవితంలో క్షమించలేని తప్పు చేసింది : అభిషేక్ బచ్చన్
బాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్. తెర మీదనే కాకుండా తెర బయట కూడా ఈ జంట చూడ ముచ్చటగా ఉంటోంది. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయానే ప్రచారం జరుగుతోంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే అలాంటి ఏమి లేదని తాము కలిసే ఉన్నామని ఈ జంట క్లారిటీ ఇస్తున్నప్పటికి ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.
దీంతో సహనం కోల్పోయిన అభిషేక్ బచ్చన్..మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఐశ్వర్యకు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ తెలిపారు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన విచిత్ర ఘటనను ఆయన ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. హీరోయిన్ కరీనా కపూర్‌పై అభిషేక్ బచ్చన్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ రోజు సినిమా షూటింగ్‌లో భాగంగా రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నాము. అయితే ఆ సీన్ మధ్యలో కరీనా కపూర్ నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడవని.. నీతో నేను రొమాంటిక్ సీన్స్ ఎలా చేయాలి?.. ప్రేమలో పడినట్లు ఎలా యాక్టింగ్ చేయాలి అని చెప్పిందని అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చాడు. ఆమె ఒక్కసారిగా అలా అనేయడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
దీంతో ఇంకా కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు కూడా నాకు ఆమె మాటలే గుర్తొచ్చి ఆమెతో మంచిగా రొమాంటిక్ సీన్లు పండించలేక పోయాను. అది నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆమె అలా చెప్పి జీవితంలో క్షమించలేని తప్పు చేసింది అంటూ అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా అభిషేక్ బచ్చన్ వారసుడిగా 2000లో 'రెఫ్యూజీ' అనే సినిమాతో ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా దర్శకత్వం వహించగా.. కరీనా కపూర్ కూడా ఈ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కరీనా కపూర్ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.అభిషేక్ బచ్చన్ మాత్రం వరుస ఫ్లాప్‌లతో సతమతం అవతూ బాలీవుడ్ రేస్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్‌ను ఉద్దేశించి అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications