వేశ్య పాత్రలో అక్కినేని కోడలు.. గౌరవంగా ఉందని కామెంట్స్ !
తెలుగు అమ్మాయి, అక్కినేని వారి ఇంటి కోడలు 'శోభిత దూళిపాళ్ల' గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్ రంగంలో ప్రవేశించి 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2016లో 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం 'గూడాచారి' పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో కూడా అదరగొట్టింది.
తన కెరీర్‌లో ఎక్కువ చిత్రాలు చేయకున్నా.. ప్రతి ప్రాజెక్ట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ఆమె నటించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమాలో శోభిత వేశ్య పాత్రలో నటించిందని తెలిసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఆమె నటించిన సినిమాల్లో బోల్డ్ సీన్స్ గురించి ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. దీంతో ఇప్పుడు ఏకంగా వేశ్య పాత్రలో నటించందని తెలిసి ట్రోల్ చేస్తున్న తరుణంలో వాటికి తనదైన శైలిలో చెక్ పెట్టింది.

2024లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్' లో శోభిత సీత అనే వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. ఆమె పాత్రకు మంచి స్పందన దక్కింది. దాని గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సీత' అనే కాల్ గర్ల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో ఇంటెన్స్‌గా నటించానని పేర్కొంది. పాత్రకు డెప్త్ ఎక్కువగా ఉండటంతో తనలోని నటిని పూర్తి స్థాయిలో వెలికితీసే అవకాశం కలిగిందని తెలిపింది. గతేడాది ఏప్రిల్ 5న ఆ చిత్రం రిలీజ్ అయ్యింది.
ఇక మరోవైపు 2024 డిసెంబర్ 4న ప్రముఖ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టింది శోభిత. నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్టివ్‌గానే ఉన్నాడు. ఇటీవలే చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.












Click it and Unblock the Notifications