హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చెన్నై అళ్వార్‌పేటలో గల డీడీకే రోడ్‌లో నివసిస్తోంది విజయ్ ఆంటోనీ కుటుంబం. ఆయనకు భార్య ఫాతిమా, ఇద్దరు కుమార్తెలు లారా ఆంటోని, మీరా ఆంటోనీ ఉన్నారు. 16 సంవత్సరాల మీరా చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నారు. చదువులో వెనుకపడటం ఒత్తిడిలోకి నెట్టినట్టు చెబుతున్నారు.

ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇంట్లో తన గదిలో దుపట్టాతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను గుర్తించిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఇంట్లో లేడు. రథ్థం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్నారు.
అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించిన మర్డర్ మిస్టరీ మూవీ ఇది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. నందిత శ్వేత, రమ్య నంబీశన్ కీలక పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు విజయ్ ఆంటోనీ. కుమార్తె మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన చెన్నైకి బయలుదేరారు.












Click it and Unblock the Notifications