ఈ నటుడి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా.. "మాజీ సీఎం" మేనల్లుడు అని తెలుసా ???

టాలీవుడ్‌లో కొన్ని ముఖాలు పేరుకన్నా పాత్రలతోనే గుర్తుండిపోతాయి. అలాంటి నటుల్లో ఒకరు చిన్నా. పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టకపోయినా, "ఆ ఇంట్లో హీరో" అంటే మాత్రం చాలా మందికి వెంటనే గుర్తుకు వస్తారు. ఒక్క సినిమా ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆయన అసలు పేరు అరుగుట జితేందర్ రెడ్డి. కాగా చిన్నా సినీ ప్రయాణం ఆత్మకథ సినిమాతో ప్రారంభమైంది. కానీ నిజమైన బ్రేక్ మాత్రం శివ ద్వారా వచ్చింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్‌లో చిన్నా చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలోని తన పాత్ర పేరు అంతగా పాపులర్ కావడంతో, అదే పేరును ఆయన స్క్రీన్ నేమ్‌గా మార్చుకోవడం విశేషం. "శివ" చిన్నా కెరీర్‌కు మలుపుతిప్పిన సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత చిన్నా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ నటుడిగా మారారు. మధురా నగరిలో, లాఠీ, చైతన్య వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా అల్లరి పిల్ల సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

actor-chinna-who-got-fame-from-shiva-movie-is-son-in-law-of-ex-cm-nedurumalli-janardhan-reddy

ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా, చిన్నా హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దెయ్యం వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఆయన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రం ఆ ఇంట్లో. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించి, తెలుగు హారర్ జానర్‌లో ఒక క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీ టీవీల్లో వస్తే ప్రేక్షకులను భయపెట్టే స్థాయిలో ఉంటుంది.

ఇప్పటివరకు చిన్నా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. నాగ భైరవి, నువ్వు నేను ప్రేమ, గీతా LLB వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి టెలివిజన్ ప్రేక్షకులను కూడా అలరించారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ చిన్నా వ్యక్తిగత జీవితం మాత్రం హాట్ టాపిక్ గా మారుతుంది. చిన్నాకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పెళ్లిళ్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఇక్కడే మరో ఆసక్తికర అంశం దాగి ఉంది.

చిన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. జనార్దన్ రెడ్డి సొంత చెల్లి కొడుకు చిన్నా అని తెలుస్తోంది. 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే చిన్నా తన మామ రాజకీయ ప్రభావాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోకుండా, పూర్తిగా తన ప్రతిభపైనే ఆధారపడి సినీ రంగంలో ఎదగడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+