ఇలా అయిపోయారేంటి సార్.. ఈ స్టార్ నటుడిని గుర్తు పట్టారా ???

టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, స్పెషల్ రోల్స్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 1989లో వచ్చిన "సింహాసనం" సినిమాతో జగపతిబాబు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1990లలో ఫ్యామిలీ ఎమోషన్లతో నిండిన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు, మావిచెట్టు, పెళ్లి, వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.

అలానే శుభలగ్నం, శుభమస్తు, పెళ్లికానుక, అంతఃపురం వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను పీక్స్ కు తీసుకెళ్లాయి. 2014లో వచ్చిన ''లెజెండ్'' సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి సెకండ్ ఇన్నింగ్స్‌ షురూ చేశారు. రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా నరసింహారెడ్డి, సలార్, అఖండ, రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

actor-jagapathi-babu-character-video-from-peddi-movie-got-viral-on-social-media-and-netizens-reactio

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న "పెద్ది" మూవీలో కూడా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

కాగా నటీనటులు పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్దమవుతుంటారు. కొంతమంది హీరోలు సినిమాల్లో పాత్రకోసం భారీగా బరువు పెరగడం.. లేదా తగ్గడం వంటివి చేస్తుంటారు. అలాగే కొంతమంది చిత్రవిచిత్రమైన మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలానే జగపతి బాబు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీలో పాత్ర కోసం మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+