కోట శ్రీనివాసరావుకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..!
తెలుగు చిత్రసీమలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో నివాసంలోనే పరమపదించారు. ఈ వార్తతో సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీతారలు, అభిమానుల అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కుటుంబ నేపధ్యం..
కోట శ్రీనివాసరావుకు 1966లో రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.. అయితే 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుమారుడు కోట ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇద్దరూ కూతుళ్లకు పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా నేపధ్యం..
1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ రంగంలో అడుగుపెట్టారు కోట శ్రీనివాసరావు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన, అనేక పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లులో కోట నటించారని తెలుస్తోంది. ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.
రాజకీయం..
కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా కోట సత్తా చాటారు. 1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ నటుడిగా స్థిర పడిపోయారు.
ఆస్తులు..
కోట శ్రీనివాసరావు సుమారు 37 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్స్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో ఉన్నంత కాలం బిజీ ఆర్టిస్టుగా గడిపిన కోటకు ఆస్తులు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ లో ఒక పెద్, రియల్ ఎస్టేట్ లో కూడా భారీ గానే పెట్టుబడులు ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications