గుర్తు పట్టలేని స్థితిలో కోట శ్రీనివాసరావు
కోట శ్రీనివాసరావు.. తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన శకం ఆయనది. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఒకేసారి భయపెట్టి, నవ్వించి ఆకట్టుకున్నాయి. విలన్, కమెడియన్ పాత్రలకే పరిమితం కాకుండా, విలనిజంలోనే హాస్యాన్ని పండించడంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు.
1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, సినిమా రంగంలోకి ప్రవేశించేనాటికి రంగస్థలంపై 20 ఏళ్ళ అనుభవాన్ని గడించారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన కోట, తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 750కి పైగా సినిమాల్లో నటించి, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది నంది పురస్కారాలను అందుకున్నారు.

నటుడిగానే కాకుండా, 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ వైద్యుడు. మొదట్లో తండ్రిలా డాక్టర్ కావాలనుకున్నా, నటనపై ఉన్న ప్రేమతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి వచ్చారు. ఆయన ప్రదర్శించిన తెలంగాణ యాస ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆయన నటన, సంభాషణలు, హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి.
అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.కోటా శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.కోటా శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును కలిసి దిగిన ఫోటోలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. బండ్ల గణేష్ "కోట బాబాయ్ ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అంటూ ఆ ఫోటోలను పంచుకున్నప్పటికీ, ఆ చిత్రాలలో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి ఆయన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
ముఖ్యంగా ఆయన ఎడమ కాలికి తీవ్రమైన గాయం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కోట శ్రీనివాసరావు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు తెరపై తమదైన ముద్ర వేసిన నటుడిని ఇలా చూసి, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు ఆయన అభిమానులను కలచివేస్తున్నాయి.


Click it and Unblock the Notifications