మహేష్ బాబు బ్రదర్ షాకింగ్ రోల్.. పాన్‌ ఇండియా మూవీలో విలన్‌ !

తెలుగు ప్రేక్షకులకు నటుడు నరేష్‌ సుపరిచితులే. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల వారసుడిగా చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. 1970లలో బాల నటుడిగా కనిపించినా.. 'ప్రేమ సంకెళ్ళు' సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత నాలుగు స్తంభాలాట, జంబలకిడి పంబ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నరేష్ విజయ నిర్మల కుమారుడు కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ కుమారుడు. ఈ రకంగా చూస్తే నరేష్ - మహేష్ అన్నదమ్ములు అవుతారు.

actor-naresh-opens-on-doing-negative-role-on-upcoming-film

కామెడీ నుంచి ఆల్‌రౌండర్‌ దాకా..

నరేష్ ఎక్కువగా కామెడీ ప్రధాన పాత్రల్లో నటించినప్పటికీ.. సెంటిమెంట్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ సినిమాల్లో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 80లు-90ల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చాలా దగ్గరైన హీరోగా నిలిచారు. అంతేకాకుండా హీరోగా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన బాగా రాణిస్తున్నారు. 'శ్రీమంతుడు', 'మహానటి', 'శతమానం భవతి' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో చేసిన ఎమోషనల్ క్యారెక్టర్ ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకువచ్చింది.

ప్రస్తుతం నారా రోహిత్ - శ్రీదేవి సాహా జంటగా నటించిన 'సుందరకాండ' సినిమాలో నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నరేష్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. నాకు కామెడీ నటుడిగా మంచి పేరు ఉంది. రంగస్థలం తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్స్‌లో కూడా నేను బాగా చేయగలనని అందరూ గుర్తించారు. చేసే ప్రతి పాత్రలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం కొన్ని మంచి ఎమోషనల్ పాత్రలు చేస్తున్నాను.

విలన్ క్యారెక్టర్ ..

అంతే కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా నటించబోతున్నానని చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. ఆ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, కామెడీ రోల్స్‌లో కనిపించిన ఆయనను పూర్తిస్థాయి విలన్‌గా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+