'ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్' మూవీ టైటిల్ రివీల్ చేసిన సలార్ యాక్టర్...
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ షురూ చేయగా.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. జూన్ 25, 2026 న మూవీ విడుదల కానుంది.
ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ ను మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ రివీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారని తెలిపారు. వారిద్దరికీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. సినిమా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి.

ఇక ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గానే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.












Click it and Unblock the Notifications