దొంగ ముం**కొడుకు వార్నర్.. రాజేంద్రప్రసాద్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
సినిమాల రిలీజ్ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ డైరెక్టర్లు, నటీనటులు ఓవర్ కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి ఘటనలు చాలానే చూశాం. ఇక రీసెంట్ గా అయితే నటీనటులు చేసే కామెంట్స్ కొంచెం హద్దు మీరుతున్నాయి. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ, మజాకా మూవీ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధరావు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'దిల్ రూబా' మూవీ ప్రొడ్యూసర్ రవి కుమార్ అయితే సినిమాలో ఫైట్స్ హై ఇవ్వకపోతే రిలీజ్ రోజే తనని కొట్టండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు మాత్రం ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం డోస్ పెంచారు. ఏకంగా దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ వ్యాఖ్యానించి అనవసరంగా చిక్కుల్లో పడ్డారు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని. కేవలం ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్.

అప్పుడప్పుడు సరదాగా తెలుగు సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ ఉంటారు డేవిడ్ వార్నర్. తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా రీల్స్ చేస్తుంటారు. ఇక అల్లు అర్జున్ పుష్ప రీల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న 'రాబిన్ హుడ్'చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి ఆయన కూడా హాజరయ్యారు.
ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు.
డేవిడ్ వార్నర్ దొంగా ముం**కొడుకు
— Telangana365 (@Telangana365) March 24, 2025
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్.
రాబిన్ హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినా రాజేంద్ర ప్రసాద్.#Robbinhood pic.twitter.com/clRbieT3Od
రాజేంద్ర ప్రసాద్ కూడా నవ్వుతూనే ఈ వ్యాఖ్యలు చేసినా అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ లో వార్నర్ తెలుగులో మాట్లాడి అందరినీ నవ్వించారు. అంతే కాకుండా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించారు.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications