ఇకపై అలా చేయను.. డేవిడ్ వార్నర్‌కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ

స్టార్ హీరో నితిన్, శ్రీలీల కలిసి నటించిన చిత్రం 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ మూవీ ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనున్న తరుణంలో.. రీసెంట్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నటీనటులతో పాటు రాజేంద్రప్రసాద్, డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్.. డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దాంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ అలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. దాంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా వార్నర్ కు క్షమాపణలు చెప్పారు.

actor-rajendra-prasad-apologizes-to-david-warner

ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఐలవ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్.. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ తెలిపారు. ఇక ముందు ఇలా జరగదు.. జరగకుండా చూసుకుంటానని వ్యాఖ్యానించారు. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమాను అందరూ చూడాలని కోరారు.

అంతకు ముందు ఏమన్నారంటే..

హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల క‌లిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదానికి చెక్ పడిందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+