ఈ నటుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు అని తెలుసా..?
సినీ పరిశ్రమలో రాణించాలనే ఆశయంతో ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లు ఎందరో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అలానే పరిశ్రమతో ఏం సంబంధం లేకుండా విత్ అవుట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చి చరిత్ర సృష్టించిన వారు ఉన్నారు. కానీ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు వరుసకు మనవడు అయ్యే వ్యక్తి ఏనాడూ కూడా తన గురించి చెప్పుకోకుండానే సినిమాల్లో రాణిస్తున్నారు.
సాయి తేజ కెరీర్ ప్రారంభ దశలోనే చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ముఖ్యంగా యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లతో కూడిన ఈ షార్ట్ ఫిలిమ్స్‌లో ఆయన నటన ప్రశంసలందుకుంది. కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్‌లో విడుదలైన ఈ షార్ట్ ఫిలిమ్స్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 'A Silent Melody', 'I Love You Idiot', 'Yours Lovingly', పిల్ల పిల్లగాడు అనే ఎమోషనల్ షార్ట్ ఫిలిమ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టచ్ చేసింది.

సాయి తేజ తన సినిమాటిక్ జర్నీని శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'మజిలీ' సినిమాతో ప్రారంభించారు. ఇందులో ఆయన 'కునాల్' అనే చిన్న కానీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత 'పైలాం పిలగా' అనే సినిమాలో హీరోగా నటించారు. అలాగే 'మై నేమ్ ఇజ్ శృతి' అనే థ్రిల్లర్ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ భారత్‌లో జరిగిన తాజా స్కాంలు నేపథ్యంలో రూపొందుతున్నట్లు సాయి తేజ స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
అయితే మాజీ ప్రధాని మనవడిగా ఉండడం వల్లే అవకాశాలు వచ్చాయని అనుకోవద్దని అంటున్నారు. తాను కూడా ఇతర స్ట్రగ్లింగ్ నటుల్లానే 5000 రూపాయల రోజువారీ రెమ్యూనరేషన్‌తో 'మజిలీ' సినిమాలో మొదలుపెట్టినట్లు సాయి తేజ పేర్కొన్నారు. తమ ఫ్యామిలీలో అందరూ ఐఏఎస్‌లు, లాయర్లు, ఐపీఎస్‌లు ఉన్నారని.. కానీ తాను మాత్రం సినిమా రంగాన్ని ఎన్నుకున్నానని చెబుతున్నారు. ఈ రంగంపై తనకు చిన్ననాటి నుంచి ఆసక్తి ఉందని.. అది నెరవేర్చుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications