Schools Closed news: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు పాఠశాలలకు సెలవు
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) సంచలన ప్రకటన చేసింది. దాంతో జూలై 29 న స్కూళ్లకు సెలవు ఉంటుందా..? లేదా..? అని అటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్రన్ ఘాట్స్, హిమాలయన్ స్టేట్స్, సెంట్రల్ ఇండియా, అలాగే ఈశాన్య భారత్ లోని పలు రాష్ట్రాల్లో జూలై 29 న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇలాగే కొనసాగితే పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు. మీడియా కథనాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలోని దాదాపు 221 పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఏటా అక్కడ నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ కారణంగా సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలోని నైనిటాల్, డెహ్రాడూన్, తెహ్రీ, రుద్రప్రయాగ్, పౌరీ, చమౌలీ అలాగే ఉత్తర కాశీ.. ఒకవేళ వర్షం అలాగే కొనసాగితే రేపు అక్కడి స్కూల్స్ కు హాలీడే ప్రకటించే అవకాశం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు మూతబడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్, మండీ, కంగ్రా, కుల్లు, షిమ్లా, సిర్ మౌర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో రేపు పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. ప్రజల భద్రత, రవాణా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నారు అక్కడి అధికారులు.
కేరళలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎర్నాకుళం, వయనాడ్, ఇదుక్కీ, కన్నౌర్, మలప్పురం, కోజికోడ్, కసర్ గాడ్, పథనంతిట్ట ప్రాంతాల్లోని పాఠశాలలకు రేపు హాలీడే ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై రేపు ఉదయం ఆయా జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది. అలాగే మహారాష్ట్రలోని థానే, ముంబై, రాయ్ గఢ్, సింధూ దుర్గ్, రత్నగిరి, పూణె, కొల్హాపూర్, సతరా, పాల్ ఘర్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌత్ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. అలాగే వల్ సాద్, సూరత్, భరుచ్, నవ్ సారీ, జునాగఢ్, జామ్ నగర్ లో భారీ వర్షాలు కురువనున్నాయి. దాంతో పాఠశాలలు మూతపడనున్నాయి. ఇక మధ్య ప్రదేశ్ లోని భోపాల్, నర్మదాపురం, జబల్ పూర్, బీటుల్, సీహోర్ తదితర స్థానిక ప్రాంతాల్లోని పాఠశాలలకు హాలీడే ప్రకటించే అవకాశం ఉంది.

వీటితోపాటు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అసోం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం తదితర రాష్ట్రాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. దాంతో ఈ రాష్ట్రాల్లోనూ జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications