అందరి లెక్కలు తేల్చుతాం -కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..!!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూనే.. ఎవరు ఏం చేస్తున్నారో తమకు తెలుసని చెప్పారు. అధికారం లోకి రాగానే అన్ని లెక్కలు బయటికి తీస్తామని హెచ్చరించారు. పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల్లో నిరాశ, నిస్పృహలు పెరిగాయని అన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టి ఏ పాట పెట్టాలి.. ఏ పాట పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు డీజేలు బంద్ చేయిస్తున్నరు. అణిచివేత ఎక్కువైతే సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి. అందుకే అదే సజ్జనర్, కిషన్ రెడ్డి ముందు దేక్ లెంగే అని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేశారని కేటీఆర్ అన్నారు. ప్యారడైజ్‌లో కేసీఆర్ పాత్ర ఉన్నది నాలుగు నిమిషాలు మాత్రమే, అయినా తమకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చిన నాయకుడిని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటుంది మనకు కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు
కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు ఎప్పుడో వచ్చేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. కమీషన్ల పేరుతో వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాయదుర్గం- శంషాబాద్ మెట్రో ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తిచేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్‌ను రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. మోసం చేసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తమకు తెలుసని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లెక్కలు బయటకు తీస్తామని చెప్పుకొచ్చారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ కార్తిక్ రెడ్డి పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. అర్హులైన పట్టభద్రులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.













Click it and Unblock the Notifications
