మహిళలకు ప్రతి నెలా రూ. 2,500.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
మహిళల అభివృద్ధి, సంక్షేమం, మహిళా సాధికారతే లక్ష్యంగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 అందించనుంది. ఈ నగదు నేరుగా మహిళల ఖాతాల్లో ప్రతి నెలా జమ కానుంది. ఈ మేరకు తాజాగా దిల్లీ ప్రభుత్వం 'లక్ష్మీ యోజన' పథకానికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 28 రక్షా బంధన్ సందర్భంగా తొలి విడత నిధులు లబ్దిదారుల ఖాతాలో జమ కానున్నాయి.
గత నెలలోనే మహిళా సమృద్ధి యోజన అని ఉన్న పథకానికి దిల్లీ లక్ష్మీ యోజన అని పేరు మార్చారు. ఈ పథకం ప్రకారం అర్హులైన లబ్దిదారుల ఖాతాలో ప్రతి నెలా రూ. 2,500 జమ కానున్నాయి. ఈ నగదు డైరెక్ట్ గా ప్రతి నెలా మహిళల ఖాతాలో జమ కానుంది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ పథకంపై మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగంగా దిల్లీ ప్రభుత్వం ప్రతి నెలా అర్హులైన మహిళల ఖాతాలో రూ. 2,500 జమ చేయనుంది.
దిల్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని తెలిపారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే..? పేద, మధ్య తరగతి మహిళలను అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చిన వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడేలా సహకారం అందించడం అని తెలిపారు. ఈ నగదు మహిళల రోజూ వారీ ఖర్చులకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అని సీఎం రేఖ గుప్తా పేర్కొన్నారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరాలంటే అర్హులైన మహిళలకు మూడు ముఖ్యమైన కండీషన్స్ ను పెట్టింది దిల్లీ ప్రభుత్వం.

దరఖాస్తుదారులకు ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేకుండా ఉండటం.. అలాగే దిల్లీకు చెందిన శాశ్వత నివాసితులై ఉండాలి. దరఖాస్తుదారులు దిల్లీలో దాదాపు 10 ఏళ్లపాటు నివసించి ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికెట్ తో పాటు ఇతర డాక్యూమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించి ఉండకూడదు.. ఇలా పలు నిబంధనలు ఉన్నాయి. నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ది దారుల ఖాతాల్లోకి జమ అయ్యే విధంగా దిల్లీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications