తెలుగు సినిమాలను కించపరిచిన సిద్దు జొన్నలగడ్డ.. పాప్ కార్న్ కోసమే !!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన సిద్దు.. హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. డీజే టెల్లు, డీజే టిల్లు 2తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గానే జాక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్దు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు.

ప్రస్తుతం సిద్ధు హీరోగా నటించిన 'తెలుసు కదా' సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీరజ కోనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతుంది. కాగా రీసెంట్ గానే సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలను కించపరిచేలా షాకింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

actor-siddu-jonnalagadda-shocking-comments-on-movie-intervals

సిద్దు మాట్లాడుతూ..

ఆడియన్స్ కొంతమంది సినిమా చూసి ఫస్ట్ ఆఫ్ బాగుందని.. ఇంకొంతమంది సెకండాఫ్ బాగుందని అంటున్నారని చెప్పారు. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ రెండు బాగున్నాయని తెలిపారు. కానీ సినిమా బాలేదని ఎవరు అనడం లేదని.. మూవీని పూర్తిగా చూస్తేనే అది మనకు అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ సినిమాలలో ఇంటర్వెల్ ఉండదని.. తెలుగు సినిమాల్లో పాప్ కార్న్ అమ్ముకోవడం కోసం ఈ ఇంటర్వల్ అనే పంచాయతీని తీసుకువచ్చారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా ఆసక్తికరంగా తీసి ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ ముందు మంచి హై ఇస్తారన్నారు. ఆ హైతో ఉన్న ఆడియన్స్ ఇంటర్వెల్ కి కాసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల మామూలు అయిపోతారని.. వారిని మళ్లీ ఫీల్ లోకి తీసుకురావడానికి టైం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+