బిగ్‌బాస్‌లో శృంగారం.. శివాజీ సంచలన కామెంట్స్

సంచలనాలకు మారు పేరుగా బిగ్‌బాస్ రియాల్టీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.

అయితే ఇది మన దేశ సంప్రదయాలకు విరుద్దంగా ఉందని చాలామంది ఈ షోపై విమర్శలు చేశారు. మిగిలిన భాషలతో పోలిస్తే...హిందీలో రొమాన్స్ కాస్తా ఎక్కువుగానే కనిపిస్తుంటుంది. ఈ షోకు వెళ్లి ప్రేమికులకు మారిన వారు కొందరైతే..అక్కడి వెళ్లి విడిపోయిన వారు మరికొందరు. ఇక బిగ్‌బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది.

actor sivaji shocking comments on romance in bigg boss house

బిగ్‌బాస్ హౌస్‌లో శ‌ృంగారంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. 100 రోజుల పాటు తమ ఫీలింగ్స్‌‌ను ఎలా కంట్రోల్ చేసుకుంటారనే నెటిజన్ల ప్రశ్న. తాజాగా దీనిపై నటుడు శివాజీ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్‌లో చాలామంది కలిసి ఉంటారని..ఇక్కడ అన్ని వయస్సుల వారితో కలిసి ఉండాల్సి వస్తుందని శివాజీ తెలిపారు. అందరూ బిగ్‌బాస్ ఆట మీదనే ఫోకస్ పెడతారని..శృంగరానికి సంబంధించిన అంశాలకు అక్కడ తావు లేదని ఆయన చెప్పుకొచ్చారు.

actor sivaji shocking comments on romance in bigg boss house

బిగ్‌బాస్ హౌస్‌లో 50కు పైగా కెమెరాలు ఉంటాయాని..బాత్‌ రూం బయట కూడా కెమెరాలు ఉండటంలో ఏం చేసిన రికార్డు అవుతుందని.. సో అలాంటి వాటికి అక్కడ చోటు లేదని శివాజీ పేర్కొన్నారు. బిగ్‌బాస్‌కు వచ్చేది సెలబ్రిటీలు కావడంతో.. అందరూ గేమ్ ఎలా గెలవాలనే దానిపైనే శ్రద్ధ పెడతారని అంతకు మించి వేరే వాటి మీదకు వారి ఆలోచనలు వెళ్లే అవకాశమే లేదని శివాజీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+