నాకు చేతబడి చేశారు.. అందుకే అలా - టాలీవుడ్ స్టార్ హీరో !

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు "సుమన్". సుమారు 150కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సరితూగే స్థాయిలో నిలిచిన హీరోగా ఆయన గుర్తింపు పొందాడు. తన అందం, నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌.. అలా అన్నింటిలోనూ సుమన్‌కి తనదైన ముద్ర ఉంది అనడంలో సందేహం అక్కర్లేదు.

కాగా 1980, 1990 దశకాల్లో సుమన్ కెరీర్ పీక్‌లో ఉంది. ఆయాన నటించిన పలు సినిమాలు సూపర్ హిట్స్ సాధించి ప్రేక్షకుల్లో ఆయనకు ఫుల్ క్రేజ్ తీసుకొచ్చాయి. అప్పట్లో ఆయనను మెగాస్టార్ అనే ట్యాగ్ లైన్ కూడా మొదట్లో ఆయనకు ఇచ్చినట్టు చెబుతుంటారు. కానీ అనుకోని సంఘటనలు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సుమన్‌పై ఒక కేసు నమోదై ఆయన ఆరు నెలల పాటు జైలులో ఉన్న ఘటన ఆ సమయంలో పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత ఆయన సినిమాల ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత చిరంజీవి నంబర్ వన్ హీరోగా ఎదిగారు.

actor-suman-shocking-comments-on-black-magic-goes-viral

'శివాజీ'తో విలన్‌గా రీఎంట్రీ..

అయితే కొంత కాలం తర్వాత సుమన్ మళ్లీ తెరపైకి వచ్చి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. రజనీకాంత్ హీరోగా వచ్చిన "శివాజీ - ది బాస్" సినిమాలో విలన్‌గా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆయన తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు.

నాకు చేతబడి చేశారు - సుమన్

ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో సుమన్ తన జీవితంలోని ఓ అనుభవాన్ని పంచుకున్నారు. తన ఎదుగుదలను కొందరు భరించలేక తనపై చేతబడి చేయించారని వెల్లడించారు. అది ఎవరు చేశారో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలోనే కాదు, బిజినెస్‌లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయని.. చేతబడి కేరళలో చాలా ఫేమస్ అని తెలిపారు. అక్కడ 'చోటనికరే' అనే ప్రదేశం ఉందని.. అక్కడే చేతబడి నయం చేస్తారని చెప్పుకొచ్చారు. తాను కూడా అక్కడికి వెళ్లి దానికి విరుగుడు చేయించుకున్నట్టు సుమన్ వివరించారు.

actor-suman-shocking-comments-on-black-magic-goes-viral

అంతే కాకుండా తాను టైమ్‌ని బాగా నమ్ముతానని.. ఎవ్వరూ కావాలని తప్పు చేయరని సుమన్ వెల్లడించారు. కర్మే వాళ్లతో తప్పు చేయిస్తుందని.. ఆ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. మనం చేసిన పనికి ఫలితాన్ని అనుభవించాల్సిందేనాన్నారు. అది ఒక్కరే కాదని.. కుటుంబం కూడా అనుభవిస్తుందని చెప్పారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+