కూతురితో కూడా కమల్ హాసన్ రొమాన్స్ చేయగలడు..సుమన్ షాకింగ్ కామెంట్స్
లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు. హీరోగా, విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. ఈతరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోలు లేరంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో దశావతారం సినిమాలో 10 పాత్రల్లో కనిపించి చరిత్ర సృష్టించారు.
నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ సేవలు అందించారు. అలాంటి కమల్ హాసన్‌పై నటుడు సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన తన కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకుల గురించి వివరించారు. సుమన్ కూడా ఒకప్పుడు హీరోగా నటించారనే విషయం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ టాప్ పొజిషన్‌కు చేరువయ్యారు.

అగ్ర హీరోగా ఎదుగుతున్న సమయంలో లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కుని ఆయన జైలుకు వెళ్లారు. దీంతో సుమన్ క్రేజ్ మసకబారింది. తాను జైలుకు వెళ్లడానికి చిరంజీవే కారణమని వచ్చిన వార్తలను సుమన్ ఖండించారు. ఇక ఈ ఇంటర్య్వూలో సుమన్ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. కమల్ హాసన్ మాత్రం రొమాంటిక్ హీరో. ఆయన డ్రెస్సింగ్ అప్పుడు యూత్ ఫాలో అయ్యేవారని సుమన్ తెలిపారు. కమల్ హాసన్ రొమాన్స్ చేస్తుంటే చాలా సహజంగా ఉండేదని..అది మన కళ్ళముందు చేస్తున్నట్లు ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమాలో పాత్ర కోసం కమల్ చాలా కష్టపడేవారని సుమన్ పేర్కొన్నారు.కమల్ హాసన్ డీ గ్లామర్ రోల్స్ చేసేవారని. మాలాంటి వారు అలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం సరిపోయేది కాదని సుమన్ వివరించారు. ఇంకా చెప్పాలంటే తన కూతురు శృతి హాసన్‌తో రొమాంటిక్ సీన్ చేయమన్నా ఆయన చేసేస్తారు. అది అందరికీ రాదని సుమన్ వ్యాఖ్యానించారు. అయితే సుమన్ ,కమల్ హాసన్ గొప్పతనం గురించే వివరించారు. కానీ అది బయటకు తప్పుగా వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications